నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్‌లో జరిమానా!

23 Jan, 2023 16:21 IST|Sakshi

ఇటీవల కొంతమంది సోషల్‌మీడియా వినియోగదారులు మంచి మంచి వీడియోలతో రాత్రికి రాత్రి మంచి స్టార్‌డమ్‌ తెచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్లు చేసే పిచ్చి స్టంట్లు వారిని ఇబ్బందిపాలు చేయడం లేక కటకటాల పాలుచేయడమో! జరుగుతోంది. అచ్చం అలాంటి పనే ఇక్కడొక యువతి చేసి భారీ జరిమానాను ఎదుర్కొంటోంది. ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫేమ్‌ ఉన్న ఆ యువతి ఒక వీడియో కోసం అని ఒక పిచ్చి స్టంట్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోని చూసిన పోలీసులు ఆమెకు భారీగా జరిమాన విధించడమే గాక లీగల్‌ యాక్షన్స్‌ తీసుకుంటామని గట్టి వార్నింగ్‌ ఇ‍చ్చారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఆమె కారుని హైవే మధ్యలో ఆపి హిరోయిన్‌ రేంజ్‌లో ఫోజులు కొడుతున్న ఓ వీడియోని ఇన​్‌స్టాగ్రాంలో పోస్‌ చేసింది. ఐతే నెట్టింట వైరల్‌ అవుతున్న ఆవీడియోని చూసి ఘజియాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసలు సదరు మహిళను ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫాలోవర్స్‌ ఉన్న వైశాలి చౌదరి ఖుటైల్‌గా గుర్తించారు.

అంతేగాదు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు  ఏకంగా రూ. 17 వేలు జరిమానా విధిస్తూ గట్టి షాక్‌ ఇచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ మేరకు సాహిబాద్‌ ఏసీపీ ట్విట్టర్‌ వేదికగా ఠాణా సాహిబాద్‌ ప్రాంతంలో ఒక యువతి కారుని నడిరోడ్డుపై ఆపి ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినందుకుగానూ రూ.17 వేలు జరిమాన విధిస్తున్నట్లు చలానా పంపినట్లు తెలిపారు. అంతేగాదు ఇందుకు గాను ఆ యువతిపై తాము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఏసిపీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

A post shared by Vish ♥️ (@vaishali_chaudhary_khutail)

(చదవండి: ఆ స్కూల్‌లో ఒకే ఒక్కడు స్టూడెంట్‌!)

మరిన్ని వార్తలు