జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..

12 Mar, 2023 20:48 IST|Sakshi

గాంధీనగర్‌: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు.  'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది.

మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు.

విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్‌లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది.
చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్‌ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు