Viral Video: నాటు నాటు పాటకి జర్మన్‌ అంబాసిడర్‌ స్టెప్పులు..నెక్స్ట్‌ ఎవరంటూ ఎంబసీ ఛాలెంజ్‌

18 Mar, 2023 19:44 IST|Sakshi

నాటు నాటు పాట యావత్‌ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్‌ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్‌.

ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్‌లోని జర్మన్‌ రాయబారి డాక్టర్‌ ఫిలిఫ్‌ అకెర్‌మాన్‌ ఓల్డ్‌ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్‌లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్‌ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్‌ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు.  

ఆ తర్వాత అకెర్‌మాన్‌ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్‌ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్‌గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్‌ చేశారు.

అంతేగాదు ఆయన ట్విట్టర్‌లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్‌లోని కొరియన్‌ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇ‍ప్పుడూ నెక్స్ట్‌ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్‌ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్‌ జే బోక్‌ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్‌ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్‌ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోపై భారత్‌లోని బ్రిటీష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. 

(చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్‌)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు