వెంటాడిన కుక్కల గుంపు.. యువతి చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

18 Jul, 2021 12:14 IST|Sakshi

సోషల్‌ మీడియోలో నిత్యం ఎన్నోరకాల వీడియోలు వైరల్‌ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు ఎంతో ఆహ్లదాన్ని కలిగిస్తాయి. మరి కొన్ని మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక వీడియో సోషల్‌ మీడియోలో ఇప్పుడు  తెగ వైరల్‌ అవుతోంది. సాధారణంగా ఎవరైనా కుక్కలు అంటే భయపడతారు. మనం రాత్రి సమయంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో కుక్కల గుంపు వెంటాడితే ఏం చేస్తాం.. మనం భయపడి పరుగులు పెడతాం లేక తిరిగి ప్రతిఘటిస్తాం. కానీ  ఇలాంటి సమయంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాత్రి సమయంలో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది.. ఇంతలో శునక రాజాలు ఆమెకు కనిపించాయి. ఒక్క సారిగా ఆ యువతిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ఆ అమ్మాయి డ్యాన్స్‌ చేసింది. అవును మీరు విన్నది నిజం.. ఆ అమ్మాయి కుక్కలను చూసి బెదిరిపోకుండా తనలోని నృత్య కళా కౌశలాన్ని బయటకు తీసింది. ఆమె చేసిన డ్యాన్స్‌ కుక్కలుకు బాగా నచ్చినట్టుంది.. అలా చూస్తూ కూర్చున్నాయి. అదే దారిలో వెళ్తున్న మరో వ్యక్తి  ఈ వీడియో తీసి సోషల్‌ మీడియోలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియో లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భలే సమయస్ఫూర్తి అంటుండగా.. మరికొందరు పిచ్చి పీక్స్‌ వెళ్లిందేమో అలా చేస్తోందని తిట్టిపోస్తున్నారు.

 

                

మరిన్ని వార్తలు