వైరల్‌: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్‌.. సరిపోయిందా.. ఇంకా కావాలా?

13 Nov, 2021 16:21 IST|Sakshi

ఈ మధ్య కాలంలో ఫంక్షన్‌ ఏదైనా ఫోటో షూట్‌లు మాత్రం పక్కా ఉండాల్సిందే. బర్త్‌డే అయినా, పెళ్లి అయినా చిరకాలం గుర్తుండి పోవాలంటే ఫోటో షూట్‌ తప్పనిసరి. ఇక పెళ్లి ముందే అయితే వెడ్డింగ్‌ షూట్‌ల శర మామూలు అయిపోయాయి. లక్షలు ధారపోసి మరీ ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. అచ్చం ఓ ఇలాగే ఓ యువతి ఫోటో షూట్‌ ప్లాన్‌ చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోవాలనుకుని నది దగ్గర ఫోటో షూట్‌ ఏర్పాటు చేసింది. కెమెరామెన్‌, అసిస్టెంట్‌, మెకప్‌మెన్‌.. ఇలా అందరూ రెడీగా ఉన్నారు.
చదవండి: వీడియో వైరల్‌: ప్రియుడితో పారిపోయిందని.. సీరా పూసి.. గుండు కొట్టించి

యువతి కూడా అందమైన గులాబి రంగు గౌనులో మరింత అందంగా ముస్తాబు అయ్యింది. నది ఒడ్డున కొన్ని అడుగుల లోతు నీటిపై క్రేన్‌ సాయంతో అమర్చిన సన్నని ఊయల మీద కూర్చొని ఫోటోషూట్‌కు ఫోజిచ్చింది. పక్క నుంచి ఓ వ్యక్తి యువతి గౌనులో గాలో ఎగిరేలా ప్రయత్నిస్తున్నాడు.. అయితే యువతి కొంచెం బొద్దుగా ఉండటం, బ్యాలెన్స్‌ తప్పడంతో ఒక్కసారిగా ఊయల మీద నుంచి జారీ అమాంతం నీళ్లలో పడిపపోయింది.
చదవండి: ఫెయిల్‌ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్‌ వీడియో

అనంతరం నీటి నుంచి బయటకు వచ్చిన యువతి, అక్కడి వారంతా జరిగింది తలుచుకొని పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు తెగ నవ్వుకకుంటున్నారు. అయితే ‘ రిస్క్‌ తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఇలాంటి మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా ఇంకొంచెం కావాలా’అఅంటూ  పలువురు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

A post shared by punjabi industry (@punjabi_industry__)

మరిన్ని వార్తలు