విమానం కిందకు కారు.. తప్పిన పెను ప్రమాదం!

2 Aug, 2022 15:03 IST|Sakshi

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా వాహనకారులకు స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా జరిమానాలు విధిస్తూ కట్టిడి చేస్తున్నప్పటికీ ప్రమాదం ఎటూ నుంచి ముంచుకొస్తోందో అర్థం కాని స్థితి. ప్రస్తుతం ఇక్కడ కూడా అలానే జరిగింది. అదీకూడా విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రతతో కూడిన ఆ చోట కన్నురెప్ప పాటులో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది.

వివరాల్లోకెళ్తే....ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఏ 320 నియో ఢాకాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు.. విమానం కిందకు వెళ్లిపోయింది. వాస్తవానికి విమానం ముందు చక్రానికి ఢీ కొట్టిందేమోనని అక్కడ ఉన్న అధికారులు టెన్షన్‌తో ఊపిరి బిగపెట్టుకుని చూస్తున్నారు. ఐతే అనూహ్యంగా తృటిలో పెద్ద పెనుప్రమాదం తప్పిపోయింది.

ఆ విమానానికి ఉన్న ముందు చక్రానికి వెంట్రుకవాసి దూరంలో ఈ కారు ఆగిపోయింది.  ఈ ఘటనకు గల కారణాలు గురించి  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డీజీసీఏ సివిల్‌ ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్‌ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా కారు నడిపాడేమోనని బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష కూడా నిర్వహించారు.

ఐతే నెగిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ విమానం మంగళవారం ఉదయం పాట్నాకు వెళ్లేందకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఐతే ఈ ఘటన పై ఇండిగో కానీ గో ఫస్ట్‌ గానీ స్పందించ లేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు)

మరిన్ని వార్తలు