వధువుకి వరుడి స్నేహితుల సర్‌ఫ్రైజ్‌ గిఫ్ట్‌.. కోపంతో నేలకేసి కొట్టింది

22 Jul, 2021 16:37 IST|Sakshi

వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో వరుడు స్నేహితులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను చూసి వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో ఊహించని విధంగా ఇబ్బందికరమైన వస్తువు ఉండటంతో వెంటనే కోపంతో దాన్ని బయటకు విసిరేస్తుంది. మరి వరుడు స్నేహితులు ఏం గిఫ్ట్‌ ఇచ్చారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లిపోదాం.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై కూర్చొని ఉంటారు. అంతలోనే అక్కడకు పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతారు. అలాగే ప్యాక్‌ చేసి ఉన్న ఓ గిఫ్ట్‌ను సరదాగా వధువుకి అందిస్తారు. గిఫ్ట్‌ను పెళ్లి కూతురు అక్కడే తెరిచి చూడగా అందులో చిన్న పిల్లలకు పాలు తాగించే బాటిల్‌ ఉంటుంది.

తనకిచ్చిన ఫన్నీ గిఫ్ట్‌ నచ్చకపోవడంతో వెంటనే దాన్ని వధువుకు విసిరేసింది. దీనిని చూసిన అక్కడి వారంతా పడిపడి నవ్వుతూనే.. మళ్లీ అదే బాటిల్‌ ఉన్న గిఫ్ట్‌ను వధువుకివ్వడంతో ఈసారి వధువుకు చిర్రెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న మరో మహిళా ఆ వస్తువును వెంటనే లాక్కుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బు‌క్‌లో బంటి ఠాగూర్‌ అనే వ్యక్తి పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ పోస్టుకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘ప్రతి ఒక్కరిని గౌరవించాలి. సరదా కోసం ఎవరిని హర్ట్‌ చేయొద్దు’ అంటూ నెటిజన్లు హితవు పలుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు