చాట్‌ అమ్ముతూ కేజ్రీవాల్‌ !.. తీరా చూస్తే అసలు కథ వేరే..

14 Oct, 2021 18:56 IST|Sakshi

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారని అంటుంటారు. ఈ విషయంలో సాధారణ ప్రజలకు డూపుల కన్నా సెలబ్రిటీల డూపుల ఫోటోలు మాత్రం సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లా ఉన్న వ్యక్తి ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే....!

వివరాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ్వాలియ‌ర్‌లోని ఫూల్ బాగ్ ఏరియాలో మోతీ మ‌హ‌ల్ ముందు గుప్తా చాట్ పేరుతో ఓ వ్యక్తి స్టాల్‌ను నిర్వ‌హిస్తున్నాడు.ప్రస్తుతం అతను సెలబ్రిటీలా మారిపోయాడు. ఎందుకుంటే అతను అచ్చం ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను పోలి ఉన్నాడు కాబట్టి. తన స్టాల్‌లో.. రుచికరమైన చాట్‌తో పాటు స్వీట్లకు అది ఫేమస్‌.  ఇటీవల ఫుడ్ బ్లాగ‌ర్ నడుపుతున్న ఓ వ్యక్తి ఈ గుప్తా చాట్ నిర్వాహ‌కుడిని వద్దకు వస్తాడు. చాట్‌ నిర్వాహకుడు సీఎం కేజ్రీవాల్‌లా ఉండ‌టంతో చూసి అతను ఆశ్చర్యపోతాడు.(చదవండి: Viral Video: బాబోయ్‌ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేసి..)

ఇంకేముంది షాక్‌ నుంచి తేరుకుని అతన్ని సంప్రదించి తను చేసే వంటని వీడియోగా చిత్రీక‌రించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. సెలబ్రిటీ అందులోనా దేశరాజధానికి సీఎంను పోలి ఉండడంతో అది వైరల్‌గా మారి నెట్టింట దూసుకుపోతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు సడెన్‌గా చూసి కేజ్రీవాల్‌ చాట్‌ అమ్మడమేంటని అనుకున్నా..తీరా చూస్తే తెలిసింది అతను డూప్లికేట్ కేజ్రీవాల్ అంటూ కామెంట్స్ చేశాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ డూప్లికేట్ కేజ్రీవాల్‌ను ఒక్క‌సారైనా క‌ల‌వాలి అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

చదవండి: Funny Video: ఏయ్‌ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు