వైరల్‌ వీడియో.. పెయింట్‌ రోలర్‌తో పసుపు పూశారు

29 Sep, 2020 20:46 IST|Sakshi

కరోనా వైరస్‌ ఏ ముహుర్తాన జన్మించిందో కానీ ఈ ఏడాది పండుగలు, వేడుకలు అనే మాటే మర్చిపోయారు జనాలు. పెళ్లిల్లు జరిగినప్పటికి పెద్దగా జోష్‌ లేదు. కోవిడ్‌ నియమాల నేపథ్యంలో వివాహ వేడుక రూపరేఖలే మారి పోయాయి. తక్కువ మంది అతిథుల సమక్షంలో.. సామాజిక దూరం పాటిస్తూ చాలా సాధారణంగా జరిగాయి. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హల్ది వేడుకకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కడుతుంది. ఉత్తర భారతదేశంలో వివాహానికి ముందు జరిపే ఈ వేడుకలో.. వధూవరులకు పవిత్రతకు చిహ్నంగా భావించే పసుపు ముద్దను పూస్తారు. ఈ ‘హల్ది’ వేడుకలో బంధుమిత్రులు పాల్గొని ఉత్సాహంగా వేడుక నిర్వహిస్తారు. (చదవండి: వావ్‌.. ఎంత క్యూట్‌గా ఉందో..!)

ఇక ఈ వీడియోలో కరోనా నిబంధనల ప్రకారం.. కాబోయే దంపతులను స్వయంగా తాకకుండా పెయింట్‌ వేయటానికి ఉపయోగించే రోలర్లతో వారికి పసుపు పూసారు. కాగా, ఆ సమయంలో  అందరూ మాస్కులు ధరించటం గమనార్హం. ‘సామాజిక దూరంతో వినూత్న హల్ది వేడుక. ఇది భారతదేశంలో వివాహానికి ముందే జరిగే వేడుక, పసుపు (హల్ది), నూనె, నీరు కలిపిన మిశ్రమాన్ని వివాహం అయిన స్త్రీలు పెళ్లికి ముందు వధూవరులకు పూసి ఆశీర్వదించుతారు’ అంటూ ట్వీట్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.

మరిన్ని వార్తలు