జూమ్‌ కాల్‌‌లో ఫన్నీ రొమాన్స్‌ : వైరల్‌

20 Feb, 2021 10:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మన జీవితంలో చాలామార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా భౌతిక దూరం, ఫేస్‌మాస్క్‌, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లాంటి మూడు సూత్రాలు కచ్చితంగా పాటించాల్సి పరిస్థతుల్లో జీవించాం. జీవిస్తున్నాం... కూడా. అదే సందర్భంలో భౌతిక దూరం పాటించేలా చాలావరకు సమావేశాలు, ఇంటర్వ్యూలు వర్చువల్‌గా మారిపోయాయి. ఈ  నేపథ్యంలో  ఒక జూమ్ కాల్‌లో చోటు చేసుకున్న ఈ చిలిపి ఘటన నెట్టింట్లో సందడి చేస్తోంది. ఒక ఎనలిస్టు, జూమ్‌ మీటింగ్‌లో దేశ జీడీపీపై చాలా సీరియస్‌గా విశ్లేషిస్తున్నారు. ఇంతలో ఆయన భార్యగా భావిస్తున్న మహిళ సడన్‌గా వచ్చి ఆయనను కిస్‌ చేయబోయింది.  దీనికి హతాశుడైన భర్తగారు.. వాట్‌ నాన్‌సెన్స్‌.. కెమెరా ఆన్‌లో ఉంది అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ క్రమంలో మహిళ విసిరిన నవ్వుల పువ్వుల బాణానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నడివయసులో వీరి ఫన్నీ రొమాన్స్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే మరికొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. వాళ్ల ప్రైవసీ మాట ఏమిటి, ఇది చూస్తే వాళ్ల పిల్లలముందు పరువు పోదా అంటూ ఈ వీడియో క్లిప్పింగ్‌పై కొంతమంది కోపం ప్రదర్శిస్తుంటే.. వారి జీవితాల్లోని ఆప్యాయత, అనురాగాలకు ఇది నిదర్శనం. ప్రేమగల తల్లిదండ్రుల్ని చూసిన  పిల్లలు సంతోషిస్తారని కొంతమంది కమెంట్‌ చేస్తున్నారు. భర్తగారి వ్యక్తీకరణ చాలా మొరటుగా ఉందని కొందరు కమెంట్‌ చేస్తే..బహుశా.. ఆవిడ ఆయన భార్య కాదేమో...అంటూ చిలిపి నెటిజన్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు