Independence Day: భూమికి 30 కిలో మీటర్ల దూరంలో జెండా ఆవిష్కరణ: వీడియో వైరల్‌

15 Aug, 2022 13:51 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏ‍ళ్లు పూర్తి అయిన సందర్భంగా స్పేస్‌ కిడ్జి ఇండియా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ మేరకు స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా భారతీయ జెండాను బెలూన్‌ సాయంతో అంతరిక్షం అంచుకు పంపింది. అంతేకాదు భూమికి సుమారు 30 కి. మీటర్ల దూరంలో అంతరిక్షం అంచులలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్నాం అని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొంది.

అజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఇలా త్రివర్ణ పతాకన్ని ఆవిష్కరించినట్లు సంస్థ పేర్కొంది. ఇది స్వతంత్ర సమరయోధులందరికి గౌరవార్థం ఇచ్చే నివాళి అని పేర్కొంది. అంతేకాదు ఈ స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా దేశానికి యువ శాస్త్రవేత్తలు తయారు చేసి ఇచ్చే ఏరోస్పేస్‌ సంస్థగా అభివర్ణించుకుంటోంది. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇటీవల 750 మంది పాఠశాల బాలికలతో రూపొందించిన "ఆజాదిశాట్" ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఉపగ్రహం అస్థిర కక్ష్యలోకి పంపబడటం వల్ల ఉపయోగపడదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ మేరకు స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా త్రివరణ పతాకం ఆవిష్కరణకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో నెటిజన్లతో పంచుకుంది. 

(చదవండి: భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు)

మరిన్ని వార్తలు