ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో..

23 Jun, 2022 19:58 IST|Sakshi

తెలిసిన వారు, బంధువులు ఆపదలో ఉంటేనే ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాని రోజులివి. అడక్కముందే మాటలు ఎన్నో చెప్తారు కానీ చేతల్లోకి వచ్చే సరికి సైలెంట్‌గా సైడ్‌ అయిపోతుంటారు.  కానీ తనకు ఏం కాని వ్యక్తి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. చనిపోదామనుకున్న వ్యక్తిని ప్రాణాలను తెగించి కాపాడాడు. అతనికి కొత్త లైఫ్‌ అందించాడు.

ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య  నిర్ణయించుకున్నాడు. దూరం నుంచి రైలు కూడ వస్తోంది. అయితే అదే సమయంలో స్టేషన్‌లో విధుల్లో ఉన్న రైల్వే సిబ్బంది అతని గమనించాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరుగెత్తాడు. అటు నుంచి రైలు వేగంగా దగ్గరకు వస్తున్న భయపడకుండా ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్‌పైకి దూకి అతన్ని ఎత్తుకొని పక్క ట్రాక్‌ మీదకు తీసుకెళ్లాడు. అతను కాపాడిన సెకన్ల వ్యవధిలోనే రైలు పట్టాలపై వేగంగా వెళ్లింది. కాగా ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.. కాపాడిన వ్యక్తి పేరు మాత్రం సతీష్‌ కుమార్‌ అని తెలిసింది.
చదవండి: గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి

దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ రైల్వేస్‌ తమ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘రైల్వే సిబ్బంది సాహసోపేతమైన ధైర్యం ఒక విలువైన ప్రాణాన్ని కాపాడింది. సతీష్‌ లాంటి ధైర్యవంతులు భారతీయ రైల్వేలో ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన రైల్వే సిబ్బందిని అక్కడున్నవారు, అధికారులు ప్రశంసించారు. నెటిజన్లు సైతం సిబ్బంది ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. అతడిని దేవుడు చల్లగా చూడాలి, హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు