వైరల్‌: ఇదేం తెలివిరా నాయనా.. బైక్‌పై ఇలా కూడా వెళ్లొచ్చా!

10 May, 2021 18:46 IST|Sakshi

బైక్‌పై సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు జర్నీ చేయవచ్చు. కానీ కొన్నిసార్లు ముగ్గురు కూడా వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే  మరో ఇద్దరితో కలిసి మహా అంటే నలుగురు ప్రయాణించవచ్చు. కానీ ఇద్దరికి మించి బైక్‌పై ఎంతమందితో ట్రావెల్‌ చేసిన అది చట్టరీత్యా నేరమే. అయితే ఇప్పుడు చెప్పబోయే బైక్‌పై అయిదుగురు వెళ్తున్నారు.. అందులో నలుగురు కూర్చుంటే ఓ వ్యక్తి మాత్రం గాల్లో సూపర్‌ మ్యాన్‌లా తేలుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. కావేరీ అనే మహిళ బైక్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇందులో ఓ బైక్‌పై నలుగురు వెళ్తున్నారు. ఈ నలుగురిలో ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కాకుండా మిగతా వెనక కూర్చున్న ముగ్గురూ మరో వ్యక్తిని తమ చేతులతో పట్టుకొని మోసుకెళ్తున్నారు. ముగ్గురు జారవిడచకుండా పట్టుకోవడంతో అతను నిఠారుగా ఉండి గాల్లో తేలుతూ సూపర్ మేన్‌లా గాల్లో తేలినట్లుగా దూసుకుపోతున్నాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని చూసిన నెటిజన్లు జాగ్రత్తగా పట్టుకోకపోతే వాడు గాల్లో తేలడం కాదు. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ‘ఈ వీడియో ఇంకా పోలీసుల కంట పడనట్టు ఉంది. చూసి ఉంటే ఖచ్చితంగా చలానా రాసే వాళ్లు ’అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: ఫైర్‌ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది

మరిన్ని వార్తలు