‘అర్థరాత్రి ఇలా ట్రై చేస్తే ఇక నా జీవితం అంతే సంగతి’

17 Sep, 2021 21:15 IST|Sakshi

పిల్లలు ఏ విషయం అయిన తొందరగా నేర్చుకుంటారంటారు. పనులైన, ఆటలైన ఒక్కసారి ఆసక్తి పెట్టారంటే ఇట్టే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ చిన్నారి ఎలాంటి సాయం లేకుండా అవలీలగా గోడను పాకుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. ఐదేళ్ల చిన్నారి ఇంట్లోని రెండు గోడల మధ్య ఒక్కో కాలు పెట్టి స్పైడర్‌మెన్‌లా పైకి పాకుతుంది. నిమిషంలోనే ఇంటి పైకప్పు వరకు చేరి అక్కడే కాసేపు విన్యాసాలు చేసింది. కాళ్లను, చేతులను ఆడిస్తూ ఫీట్లు చేసింది. అనంతరం మళ్లీ అలాగే పాకుతూ కిందకు దిగింది.

అయితే ఇక్కడ చిన్నారి గోడకు వ్యతిరేకంగా చేతులు, కాళ్లను ఉంచడం విశేషం. వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. పాప టాలెంట్‌ను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘చిన్నారి.. నువ్వు సూపర్‌. అచ్చం స్పైడర్‌లా వెళ్లావ్‌. అర్ధరాత్రి నిద్రలోంచి లేచి ఇలాంటివి ట్రైం చేస్తే ఇక నా జీవితమంతా డాక్టర్‌తో మందులు వాడుతూనే ఉంటాను’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు తెలియరాలేదు.
చదవండి: తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లిన ఏం కాలేదంటే..
రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు