‘సెల్యూట్‌ సూపర్‌ మ్యాన్‌’.. బైక్‌ను నెత్తిన పెట్టుకొని.. బస్సెక్కించాడు.. వైరలవుతున్న వీడియో

28 Nov, 2022 13:55 IST|Sakshi

కుటుంబాన్ని పోషించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పనులు చేస్తుంటారు. పొట్ట కూటి కోసం కొందరు ఎంత కష్టమైనా భరిస్తుంటారు. తమ శక్తికి మించి చెమట చిందిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా  మారింది. సాధారణంగా బైక్‌ను పైకి లేపేందుకు కూడా మనకు శక్తి సరిపోదు.. అలాంటిది  ఓ వ్యక్తి బైక్‌ను తలపై పెట్టుకొని ఏకంగా బస్సు మీదకు ఎక్కించాడు.

 

ముందుగా బైక్‌ను తన నెత్తిన పెట్టుకుని బస్సు దగ్గరకు నడుస్తూ వచ్చాడు. బస్సుకు ఎడమ పక్కగా ఉన్న ఇనుప గ్రిల్స్‌కు ఏర్పాటు చేసిన నిచ్చెన సాయంతో పైకి వచ్చాడు. తన మెడను బ్యాలెన్స్‌ చేసుకుంటూ బస్సు టాప్‌పైన ఉన్న క్యారియర్‌పై బైక్‌ను దించేశాడు. బైక్‌ను నెత్తిన పెట్టుకుని కొద్ది దూరం నడిచి బస్సు టాప్‌పైకి ఎక్కించారు. అయితే అది ఎక్కడ జరిగిందో, అతనెవరనేదానిపై స్పష్టత లేదు. 

గుల్జార్‌ సాహెబ్‌ అనే వ్యక్తి.. ఈ వీడియోను శుక్రవారం తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవ్వడంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు దీనిని 76 వేలకుపైగా మంది చూడగా, 5 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఎలాంటి సాయం లేకుండా బైక్‌ను నెత్తిన పెట్టుకొని మోసిన వ్యక్తిని సూపర్‌ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  

చదవండి: సత్యేందర్ జైన్ మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు