బెడిసి కొట్టిన పాస్తా దోశ.. తప్పక చూడాల్సిందే

24 Aug, 2020 09:07 IST|Sakshi

ప్రతిసారి ఒకే రకమైన వంటకాలను తిని బోర్‌ అనిపించినవారు అప్పుడప్పుడు కొత్తగా రకరకాల వంటకాలను పృష్టిస్తుంటారు. ఏవేవో పదార్థాలను కలిపి వినూత్నంగా తయారు చేయాలి అనుకుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు అవి సానుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి. అచ్చం అలాగే తమిళానాడులోని ఓ వ్యక్తికి కొత్తగా ఏదో తినాలనిపించినట్టుంది. వెంటనే రెడ్‌ సాస్‌ పాస్తా దోశ’ అనే పేరుతో ఓ విచిత్రమైన దోశను వేశాడు. అంతేగాక దీనిని వీడియో తీసీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. (స్కిన్‌ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!)

దాదాపు నిమిషం నిడివిగల ఈ వీడియోలో దోశ పెనంపై పిండి వేసి దానిపై ఉల్లిపాయ. టమాట, క్యాప్సికమ్‌, కెచప్‌, సాస్,‌ మసాలాలు, వెన్న వేసి వాటిని, దోశ మొత్తం సమానంగా కలిపాడు. ఆ తర్వాత దానిపై ఉడికించిన పాస్తా, కొంత క్రీమ్‌ వేసి మళ్లీ మిక్స్‌ చేశాడు. చివరగా దోశపై ఎక్కవ మొత్తంలో చీజ్‌ను తురిమి ముక్కలుగా చేసి ఇచ్చారు. అయితే ఈ దోశ నెటిజన్లకు రుచింపలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఈ వంటకాన్ని చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ‘ఇది అసహ్యంగా ఉంది. ఇందులో టన్నుల కొద్దీ జున్ను, వెన్న, నూనె ఉంది. దీన్ని చూస్తే ఆకలి చచ్చిపోతుంది. ప్లీజ్‌ ఇంకోసారి ఇలా చేయకండి’. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (నోరూరించే ఎగ్‌ దోశ వేసిన హీరోయిన్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా