బర్త్‌డే పార్టీలో అపశ్రుతి.. ముఖానికి మంటలు అంటుకోవడంతో

25 Mar, 2021 19:29 IST|Sakshi

‘పుట్టినరోజు’.. ఇది ప్రతి ఒక్కరి జీవితంతో ఎంతో ప్రత్యేకమైన రోజు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఆరోజు గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకుంటాం. అయితే ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహరాష్ట్రలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఈ నెల ప్రారంభంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అయితే కేక్‌ కటింగ్‌ సమయంలో స్ప్రే చల్లుతుండగా వెలుగుతున్న క్యాండిల్‌ కారణఃగా ప్రమాదవశాస్తు ముఖానికి మంట అంటుకుంది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి కంగారుగా వెనకకు పరిగెత్తాడు. భయాందోళనకు గురైన అతని స్నేహితులు  మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వల్ల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుక విషాదంగా మారింది.

ఇదంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీస్తుండగా రికార్డయ్యింది. ఒళ్లు జలదరించే ఈ వీడియోను పునేట్రావెల్క్స్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్‌పట్ల జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు ‘పుట్టినరోజు స్నో ఫోమ్‌ ఉపయోగించవద్దు. దాని నురుగు కంటికి మంచిగానే కనిపిస్తుంది కానీ రసాయనాలను కలిగి ఉంటుంది. మండే గుణం ఉండటం వల్ల కంటికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతేగాక ఫోమ్‌ ​మంటగా ఉంటుంది. ఇక చాలా స్ప్రే బాటిల్స్‌పై హెచ్చరిక సంకేతాలు ఉంటాయి. అందులో మంటల వద్ద స్పే చేయవద్దని సూచిస్తుంది. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో కొవ్వుత్తులు మండుతుండగా స్నో ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుంటారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.’ అని పేర్కొన్నాడు.  మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఆ బర్త్‌డే బాయ్‌కు పెద్ద ప్రమాదం జరుగలేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

A post shared by Pune travel Blogger (@punetravelx)

మరిన్ని వార్తలు