కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో

18 Sep, 2022 18:37 IST|Sakshi

భూమ్మీద ఉన్న తెలివైన జంతువులలో కోతులు ఒకటి. కానీ వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు అవి చేసే పనులు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తాయి. దేవాలయాలు, పార్క్‌లు, బహిరంగ ప్రదేశాల్లో జనాల చేతుల్లో ఆహార పదార్థాలు, ఫోన్‌లు, పర్స్‌లు కనిపిస్తే చాలు తెలివిగా వాటిని ఎత్తుకెళ్లిపోతుంటాయి. ఇళ్లలోకి దూరి కిచెన్‌లోని వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి. చేతికి దొరికిన తీసుకొని పరారవుతుంటాయి.

తాజాగా ఓ కోతి బ్యాగ్‌ నుంచి దొంగిలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో.. ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్‌ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్‌ అక్కడున్న రెండు కోతుల కంట పడింది. కానీ అక్కడ కోతులు ఉన్నాయని ఆ వ్యక్తి గమనించుకోలేదు. వెంటనే కోతులు వ్యక్తి తగిలించుకున్న బ్యాగ్‌ వద్దకు చేరుకున్నాయి. అందులో ఓ కోతి మెల్లగా బ్యాగ్‌ జిప్‌ తీసింది. మొదటి జిప్‌లో ఏం దొరకలేదు. దీంతో మరో జిప్‌ తెరిచింది. అందులో దానికి ఒక యాపిల్ దొరికింది. ఇంకేముంది దానిని తీసుకొని పరుగో పరుగు తీసింది.

దీనిని రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్.. వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. దొంగ కోతి, అది చికాగో, న్యూయార్క్‌ నుంచి వచ్చినా సరే కోతులన్నీ దొంగవే. కోతి తెలివి మామూలుగా లేదు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
చదవండి: అబ్బా! ఏం చేశాడ్రా... మూన్‌ వాకింగ్‌ స్టైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు

A post shared by Waow Africa (@waowafrica)

మరిన్ని వార్తలు