ములాయం సింగ్‌కు పాదాభివందనం చేసిన స్మృతి ఇరానీ, వీడియో వైరల్‌

31 Jan, 2022 16:45 IST|Sakshi

Mulayam Singh Yadav blesses Smriti Irani: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్‌లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్‌ యాదవ్‌ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం

కాగా ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.  ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి వేసి దీవించారు.
చదవండి: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్‌ అవుతారా?

మరిన్ని వార్తలు