చీరలో మహిళ వర్కౌట్స్‌.. వైరలవుతోన్న వీడియో

18 Jun, 2021 18:56 IST|Sakshi

కరోనా వెలుగు చూసినప్పటి నుంచి జనాలకు వ్యక్తిగత శుభ్రత, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగింది. కోవిడ్‌ నుంచి రక్షణ పొందేందుకు, శరీరాన్ని ధృడంగా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వర్కౌట్స్‌ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌తో జిమ్స్‌ మూతపడటంతో కొంతమంది బద్దకంతో వర్కౌట్స్‌ చేయడం ఆపేసి శారీరకంగా శ్రమించడం మానేశారు. మరికొంత మంది ఇంట్లోనే మిని వ్యాయమాశాలను ఏర్పాటు చేసుకొని తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మళ్లీ జిమ్స్‌ తెరుచుకోవడంతో  మెల్లమెల్లగా వ్యాయామంపై మళ్లీ కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా జిమ్‌లో ఓ మహిళ వ్యాయామం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఆమె వీడియో నెజిటన్లను ఆకర్షించడానికి ఓ కారణం ఉంది. ఎవరైనా జిమ్‌కు వెళ్లడానికి ట్రాక్‌ సూట్లు లేదా సౌకర్యవంతమైన దుస్తులనే ఎంపిక చేసుకుంటారు. కానీ పుణెకు చెందిన డాక్టర్‌ షార్వీ ఇనామ్‌దార్‌ చీర ధరించి జిమ్‌కు వెళ్తుంది. జిమ్‌లో చీరకట్టులోనే వ్యాయామం చేసి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. వెయిట్‌ లిఫ్టింగ్‌, పుష్‌-అప్స్‌, పుల్‌-అప్స్‌ అవలీలగా చేసేసింది. అంతేగాక గత ఐదేళ్ల నుంచి కఠినమైన ఫిట్‌నెస్‌ షెడ్యూల్‌ను అనుసరిస్తోంది. సాధారణంగా చీరను ధరించడమే కష్టంగా భావిస్తారు. కానీ ఇనామ్‌దార్‌ జిమ్‌లో వర్కౌట్స్‌ చేయడం అందరిని షాక్‌ గురిచేస్తోంది. ప్రస్తుతం డాక్టర్ శార్వారి జిమ్‌లో చీర ధరించి పుష్ అప్స్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. డాక్టర్ షార్వారీ చీరలో చాలా తేలికగా వర్కౌట్స్ చేయడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

తాజాగా డాక్టర్‌ షార్వారీ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘స్పష్టంగా చెప్పాలంటే మహిళలు ప్రతిరోజు చీరలు ధరించలేరు. అన్ని చోట్ల, ప్రతి ఒక్కరూ చీరలు ధరించడం సౌకర్యవంతంగా కూడా ఉండదు. కానీ ఓ భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర దరించాల్సి ఉంటుంది. అందుకే చీర ధరించడం ఏ ఇంటి మహిళకు కూడా తన శరీరాన్ని చూసుకోవడానికి, పనులు చేసుకునేందుకు అవరోధంగా ఉండకూడదు. అందుకే నేను స్త్రీతత్వాన్ని జరుపుకుంటున్నాను. ప్రతి మహిళ తన ఫిట్‌నెస్ షెడ్యూల్లో బరువు శిక్షణను చేర్చాలి. చాలా మంది మహిళలు యోగా లేదా నృత్య వ్యాయామాలు చేయటానికి ఇష్టపడతారు, కానీ మన దినచర్యలో బరువు శిక్షణను చేర్చాలి. ఎందుకంటే యవ్వనంగా ఉండటానికి, శక్తివంతంగా జీవితాన్ని ఆస్వాదించడానికి దోహదపడుతుంది’ అని సూచించారు.

చదవండి: మహా బలశాలిని: గ్యాస్‌ బండతో మహిళ ఫీట్లు వైరల్‌

A post shared by Dr. Sharvari Inamdar (@inamdarsharvari)

మరిన్ని వార్తలు