స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్‌

31 Aug, 2022 20:53 IST|Sakshi

ప్రకృతి నియమం ప్రకారం ప్రతి జీవి ఏదో ఒకదానికి ఆహారమవుతుంది. ఆ తరుణంలో కొన్ని జంతువులు క్రూరంగా వేటాడటాన్ని చూస్తే చాలం భయానకంగా ఉంటుంది. ఆ క్రూర జంతువులు నుంచి ఈ జంతువు తప్పించుకుంటే బావుండును అనిపిస్తుంది కూడా. అచ్చం అలాంటి జుగుప్సకరమైన సంఘటన ఈ వైరల్‌ వీడియోలో చోటు చేసుకుంది. 

ఆ వీడియోలో ఒక కంగారును కొండచిలువ గట్టిగా చుట్టి చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది.  ఇంతలో మరో కంగారు జంప్‌ చేసుకుని వచ్చి మరీ తన స్నేహితుడిని విడిపించేందకు శతవిధాల యత్నిస్తుంటుంది. కానీ మరోవైపు కొండ చిలువ ఏదో విధంగా చంపి తినేందుకు చూస్తుంటుంది. కానీ కంగారు మాత్రం తనకు చేతనైనంత మేర ఆ కొండచిలువను రకరకాలుగా కొరుకుతూ తన స్నేహితుడుని విడిపించేందుకు ప్రయత్నించడం చూస్తేంటే ఒక విధమైన భావన కలుగుతుంది. కొండచిలువకు చిక్కిన ఆ కంగారు బతికితే బావుండును అనిపిస్తుంది. 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

మరిన్ని వార్తలు