రాకెట్ వేగంతో ట్ర‌క్కు; కొంచెం అయ్యుంటే..

24 Aug, 2020 17:51 IST|Sakshi

తిరువ‌నంత‌పురం: 'అదృష్టం ఉన్నోడిని పాడు చేయ‌లేం, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేం' అన్న సామెత ఇత‌ని విష‌యంలో అక్ష‌రాలా నిజ‌మైంది. కేర‌ళ‌లోని కొల్లాం జిల్లాలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న వ్య‌క్తి ఎడ‌మ‌ ప‌క్క‌నుంచి ఓ ట్ర‌క్కు తుఫాను వేగంతో వెళ్లింది. క‌ళ్లు తెరిసి మూసే లోపే అది ర‌య్‌మ‌ని వెళ్లిపోయింది. దీంతో అస‌లేం జ‌రిగిందో అర్థ‌మ‌వ‌ని స్థితిలో త‌త్త‌ర‌పాటుకు లోనైన అత‌నికి ముందు రాకెట్‌లా దూసుకుపోతున్న వాహ‌నం చూసి గుండెల‌దిరిపోయాయి. పైగా ఆ బండి బ్యాలెన్స్ త‌ప్పుతూ వంక‌ర‌టింక‌ర్లు తిరిగింది. (షాకింగ్‌ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’)

అది చూసి హ‌డ‌లిపోయిన ఆ బాట‌సారి చావు త‌న ప‌క్క‌న నుంచే వెళ్లిందా అనుకుంటూ రోడ్డు దిగి ఊపిరి పీల్చుకున్నాడు. గుండెల‌దిరే ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్ర‌క్కుకు, స‌ద‌రు వ్య‌క్తికి మ‌ధ్య‌ కొన్ని ఇంచుల తేడా మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో నెటిజ‌న్లు ఆ వ్య‌క్తిని అదృష్టవంతుడు అని కొనియాడుతున్నారు. అయితే ఈ వీడియోలో అతివేగంతో వెళుతున్న డ్రైవ‌ర్‌ది త‌ప్ప‌ని కొంద‌రు, రోడ్డుపైనే ఎందుకు న‌డ‌వ‌డం?, ప‌క్క‌న దారి ఉంది క‌దా! అని స‌ద‌రు వ్య‌క్తిదే త‌ప్ప‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. (కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా