Viral Video: కోచింగ్‌ ఫీజు కోసం.. రాత్రిపూట టీ అ‍మ్ముతూ...

25 Dec, 2022 21:19 IST|Sakshi

ఎందరో స్ట్రీట్‌ లైట్ల కింద చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లను చూశాం. మరికొందరూ చదవుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇంకొందరూ తమ చదువుకు అయ్యే ఖర్చు తల్లిదండ్రులను అడగకుండా స్వశక్తితో సంపాదించుకోవాలనుకుంటారు. మరికొందరూ ఇంట్లో పరిస్థితులు సహకరించక తాము అనుకున్న విద్యను అభ్యసించేందకు రకరకాల మార్గాల్లో కష్టపడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడే చోటు చేసుకుంది.

ఇక్కడొక విద్యార్థి కోచింగ్‌ ఫీజు కోసం అని రాత్రిపూట టీ అమ్ముతుంటాడు. ఆ విద్యార్థి పేరు అజయ్‌. అతను పగటి పూట చదువుకుంటూ రాత్రిపూట సైకిల్‌పై టీ అమ్ముతూ కోచింగ్‌ డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని గోవింద్ గుర్జార్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీంతో నెటిజన్లు స్పూర్తిదాయకం, ఇలాంటి యువతకు ఆర్థిక సాయం అందిస్తే చక్కగా చదువుకుంటారంటూ సదరు విద్యార్థిని ప్రశంసిస్తూ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: వాట్‌ ఏ మాస్క్‌..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు)

మరిన్ని వార్తలు