Swiggy Boy Horse Riding: వాట్ ఎన్ ఐడియా.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. వైరలవుతోన్న వీడియో

4 Jul, 2022 15:26 IST|Sakshi

ముంబై: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. వారానికి నాలుగు సార్లైనా బయట నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొని తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరైన సమయంలో డెలివరీ బాయ్స్‌ ఫుడ్‌ను కస్టమర్‌లకు అందించాల్సి ఉంటుంది. ఎండలు, వానలతో సంబంధం లేకుంటా టైమ్‌కు డెలివరీ అవ్వాల్సిందే. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ యాప్స్‌లో డెలివరీ బాయ్స్‌ సాధారణంగా బైక్‌ మీద వస్తుంటారు. కానీ ముంబైలో వర్షాలు ఎక్కువగాపడుతుంటంతో ఓ డెలివరీ బాయ్‌ వినూత్న ఆలోచన చేశాడు. అతను చేసిన పని తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం చేశాడంటే..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్డుపై నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ బాయ్‌ గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్‌ తీసుకెళ్లడం అ‍క్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.  నగరంలో  వర్షాలు కురుస్తుండడంతో బైక్‌పై ప్రయాణించేందుకు రోడ్లు వీలుగా లేకపోవడంతో  స్విగ్గీ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రమెక్కాడు.  వెనక బ్యాగ్ తగిలించుకుని ఆర్డర్లు డెలివరీ చేసేందుకు గుర్రంపై వెళ్తు‍న్నాడు.

దీనిని వెనకాల ఉన్న వారు వీడియో తీశారు.  జస్ట్‌ ఏ వైబ్‌ అనే యూట్యూబ్‌ చానల్‌లో ఇది పోస్టు చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డెలివరీ ఆలస్యం కాకూడదని భావించిన డెలివరీ బాయ్‌ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.​ ‘పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా గుర్రాన్ని ఉపయోగించడం మంచి ఆలోచన.. ఏదో ఒక రోజు మనం వీధుల్లో గుర్రాలపై స్వారీ చేస్తామని ఆశిస్తున్నా.. నా కల నిజమైంది.’ అంటూ స్మైలీ, హార్ట్‌ ఎమోజీలను పంచుకుంటున్నారు. 
చదవండి: టీచర్‌ దండన.. విలవిలలాడిన చిన్నారి

మరిన్ని వార్తలు