వైరల్‌: బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి ఏనుగు

27 Jul, 2020 11:46 IST|Sakshi

ఏనుగులకు సంబంధించిన ఘటనలు తరచూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఏనుగుల అల్లరి, మంచితనంతో మనల్ని కట్టిపడేసే  వీడియోలు నిత్యం కంటపడుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి గజరాజుల సాహస దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఈ వీడియో ద్వారా తమ వారికి ఆపద ఎదురైతే మనుషులే కాదు ఏ మూగ జీవి అయినా ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుందనే వాస్తవాన్ని రుజువు చేసింది. ఈ ఘటన భూటాన్‌ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. (వైరల్‌: జలకాలాటల్లో ఏమీ హాయిలే..)

ఈ వీడియోలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగును కాపాడేందుకు తల్లి ఏనుగు, మరో ఏనుగు ప్రయత్రం చేస్తున్నాయి. ‘ఏనుగుల కుటుంబ బంధం చాలా బలమైనది. తల్లి, ఆంటీలిద్దరూ కలిసి పిల్ల ఏనుగురు నది నుంచి కాపాడేందుకు సాయం చేస్తున్నాయి’. అని ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా తన ట్విటర్‌ ఖాతాలో ఆదివారం షేర్‌ చేశారు. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఎంతో మంది వీక్షించగా అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. తల్లి ఏనుగును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. (ఛ‌త్తీస్‌గ‌డ్‌లో మ‌రో రెండు ఏనుగులు మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు