Maharashtra Political Crisis: రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్తలు

22 Jun, 2022 15:41 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్‌లోని సూరత్‌ హోటల్‌లో బస చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్‌ టాపిక్‌గా మారింది. 

శివసేన అల్టీమేటం
రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు ఎమ్మెల్యేలు సమావేశానికి రావాలని విప్‌ జారీ చేసింది. రాకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని శివసేన వార్నింగ్‌ ఇచ్చింది.
సంబంధిత వార్త: ‘మహా’ సంక్షోభం.. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!

శివసేన కార్యకర్తల ఆగ్రహం
రాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మాత్తుగా రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో శివసైనికులు సేన భవన్‌కు చేరుకుని షిండేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో జతకట్టాలని కోరడంతో శివసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని విడిచిపెట్టే ప్రస్తకే లేదని మండిపడుతున్నారు. నమ్మక ద్రోహులను శివసేన ఎన్నటికీ క్షమించదని షిండే ముంబైలో కాలు ఎలా మోపుతాడో చూస్తామని హెచ్చరించారు.
చదవండి: ప్రమాదంలో ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం.. అసెంబ్లీలో ఎవరి బలమెంత?

మహిళా కార్యకర్త కన్నీరు
ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసిన తిరుగుబాటుదారులైన ద్రోహులను శిక్షించాలని శివసేనకు చెందిన కొంతమంది మహిళా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ మహిళా కార్యకర్త మాట్లాడుతూ.. ‘ఓటర్లు ఎంతో నమ్మకంతో ఈ వ్యక్తులను (తిరుగుబాటుదారులను) ఎన్నుకున్నారు. కానీ వీళ్లంతా ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ ద్రోహులను శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా మహిళా కన్నీరు పెట్టుకున్నారు. ద్రోహులను శిక్షించాలంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమె పక్కన మరో మహిళ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది.
 

Poll
Loading...
మరిన్ని వార్తలు