ఫ్యామిలీ తర్వాతే ఏదైనా! అంటూ సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కూతురు

24 Jan, 2023 21:46 IST|Sakshi

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మనవాళ్లే అయిన వాళ్ల ఫంగ్షన్లకి అటెండెంట్‌ కాలేకపోతాం. ఆ బాధ మాములగా ఉండదు. బిజీ పరిస్థితులు ఒక కారణమైతే చాలా దూరంలో ఉండటం కారణంగా ఖర్చుతో కూడి ప్రయాణం అవ్వడంతో అటెండెంట్‌ కాలేకపోతాం. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు వెళ్లిపోదాం అని వేయికళ్లతో ఎదురు చూస్తాం కూడా. అచ్చం అలాంటి సమస్యనే ఇక్కడొక మహిళ కూడా ఎదుర్కొంది.

ఐతే తాను తన కుటుంబమే తన మొదటి ప్రయారిటీ అంటూ చాలా దూరంలో ఉన్న లెక్కచేయకుండా వ‍చ్చేసింది. శ్రద్ధా షెలార్‌ అనే మహిళ తన కుటుంబంతో సహా రీసెంట్‌గా యూకేకి వెళ్లింది. ఐతే ఇంతలో తన తమ్ముడి మ్యారేజ్‌ కుదరడం, జరిగిపోవడం జరిగింది. ఐతే ఆమెకు ఆ పెళ్లికి అటెండెంట్‌ కాలేని పరిస్థితి. దీంతో కుటుంబసభ్యులు ఒకింత బాధ కలిగినా సరిపెట్టుకున్నారు. ఐతే ఆ మహిళ మాత్రం ఊహించని విధంగా తన తమ్ముడి పెళ్లి వచ్చి అందర్నీ సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఇక ఆ కుటుంబం ఆనందం అంత ఇంత కాదు. ఆ మహిళ అందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో పంచుకుంది. అంతేగాదు ఎక్కడ ఉన్న మన కుటుంబం తర్వాతే ఏదైనా అంటూ అలాంటి అరుదైన సందర్భాన్ని మిస్‌ చేయొద్దు అంటూ ఒక క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

A post shared by Shraddha Shelar (@shraddha.shellar)

(చదవండి: వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు