వైరల్‌: గట్టిగా కేకలు, రచ్చ రచ్చ చేసిన మహిళ

1 Jul, 2021 14:29 IST|Sakshi

కోవిడ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువత నుంచి పండు ముసలి వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్‌ అనంతరం స్వల్ప అనారోగ్యానికి గురవుతుండంతో కొంతమంది భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో టీకా తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే సూదులంటే భయపడేవారు వ్యాక్సిన్‌  వేయించుకునే సమయంలో వ్యాక్సినేషన్‌ సెంటర్లో భయంతో నానా హంగామా చేస్తున్నారు.

తాజాగా టీకా కేంద్రంలో కూర్చున్న ఓ మహిళా రచ్చ రచ్చే చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటుండగా గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసింది. నర్సు మహిళ వద్దకు వస్తుంటే ఎక్కువ అరవడం ప్రారంభించింది. ఇక ఆమెను ఆపేందుకు ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చింది. చివరికి నర్సు టీకా వేసింది. కాగా ఈ వీడియోను ఐపీఎస్‌ అధికారి రుపిన్‌ శర్మ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘నాకు కూడా ఇంజక్షన్‌ అంటే భయం.. నేనూ ఇలాగే ఏడ్చేదాన్ని.’ అంటూ కామెంట్‌ పెడుతున్నారు. మరికొంతమందేమో.. ‘ఇంజక్షన్‌కే ఇంత భయమా, చిన్న పిల్లల కంటే ఎక్కవ అరుస్తుంది’ అంటున్నారు.

చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టిన ప్రియురాలు
ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్‌.. ఆ తర్వాత

మరిన్ని వార్తలు