భయానకం: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కుతూ కింద పడిపోయిన మహిళ..

20 Sep, 2021 20:24 IST|Sakshi

ముంబై: రన్నింగ్‌లో ఉన్న బస్సులు, రైళ్లు ఎక్కడం ప్రమాదమని అందరికి తెలుసు. అయినా కొంతమంది పట్టించుకోకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ఇలా చేయడం కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే మహరాష్టలో చోటుచేసుకుంది. ముంబైలోని రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ఓ మహిళ ఒక్కసారిగా జారీ పడిపోయింది. ఆమె కాళ్లు ప్లాట్‌ఫాం లోపలికి వెళ్లాయి.

దీనిని గమనించిన ఫ్లాట్‌ఫాంమీద ఉన్న ప్రయాణికులు, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను కాపాడారు. ప్రమాదం జరగడంతో వేగంగా వెళ్తున్న రైలు కూడా ఆగిపోయిది. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియోను చూస్తే మహిళకు తీవ్రంగానే గాయాలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఘటన భయానకంగా ఉందని, ఎవరూ ఇలా చేయోద్దంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
చదవండి: ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ..
వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం

మరిన్ని వార్తలు