ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్‌ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్‌

15 May, 2022 21:31 IST|Sakshi

దొంగతనాలకు సంబంధించిన ఎన్నో వైరల్‌ వీడియోలు చూసుంటాం. పాపం వాళ్లు దొంగతనం చేసేటప్పుడు ఎంతలా టెన్షన్‌ పడుతూ దొంగలించి పారిపోతుంటారో వంటివి చూశాం. ఎందుకింత హైరానా మంచిగా పనిచేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటా. కానీ కొంతమంది కన్నింగ్‌ క్యాండిట్లు అసలు ఏ మాత్రం భయపడుకుండా భలే చోరి చేస్తారు. వాళ్ల ముఖంలో కాస్త కూడా గాభరా గానీ ఆందోళన గానీ కనిపించదు. అచ్చం అలానే ఇక్కడో ఆంటీ ఎంతలా దొంగతనం చేసిందో చూడండి.

వివరాల్లోకెళ్తే... ఇద్దరు మహిళలు షాపింగ్‌ చేసి బిల్లు పే చేసేందుకు కౌంటర్‌ వద్దకు వచ్చారు. ఐతే అందులో ఒక మహిళ తెలివిగా తను ముందున్న మహిళ వద్దకు రాసుకుంటూ వస్తుంది. పైగా చాలా చాకచక్యంగా సదరు మహిళ పర్సులో పోన్‌ తీస్తూనే మరోవైపు బిల్‌ కౌంటర్‌ దగ్గర ఉన్న వ్యక్తి ఏవేవో సందేహాలు అడుగుతుంది. ఇంతలో ఆ మహిళ ఫోన్‌ని తన బ్యాగ్‌లో వేసుకుని కామ్‌గా వెళ్లిపోతుంది. కనీసం తన ఫోన్‌ పోయిందని పాపాం ఆ మహిళకు కూడా ఇంకా తెలియదు. ఈ మేరకు ఘనటకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు.. నోరెళ్లబెట్టిన బంధువులు.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు