భార్య కోసం ప్రేమగా గజల్‌ పాడుతున్న భర్త.. కానీ ఆమె మాత్రం!

18 Jun, 2021 20:58 IST|Sakshi

భార్య పుట్టినరోజున అద్భుతమైన బహుమతితో ఆమెను సర్‌ప్రైజ్‌ చేయాలని భర్త భావించడం సహజం. ఐఐటీ రిటైర్డు ప్రొఫెసర్‌ వీకే త్రిపాఠి కూడా అలాగే అనుకున్నారు. అందుకే శ్రీమతి కోసం గొంతు సవరించుకుని మరీ.. పక్కనే ఆమెను కూర్చోబెట్టుకుని అందమైన గజల్‌ వినిపించసాగారు. అయితే, మిసెస్‌ త్రిపాఠి మాత్రం భర్త గానానికి తాళం వేస్తూనే ఆవలింతలు ఆపుకోలేక నోటీకి చెయ్యి అడ్డుపెట్టుకుని కవర్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ వృద్ధ దంపతులకు సంబంధించిన వీడియోను వారి కుమార్తె రాఖి త్రిపాఠి ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

‘‘అమ్మ పుట్టినరోజు. నాన్న ఎంతో గంభీరంగా ఓ అందమైన గజల్‌ పాడుతున్నారు. అమ్మా.. నాన్న నీకోసమే ఇదంతా చేస్తున్నారు.. కానీ నువ్వు మాత్రం’’ అంటూ స్మైల్‌ ఎమోజీలను జతచేశారు. కాగా రాఖీ త్రిపాఠి పోస్ట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీ అమ్మానాన్నల అన్యోన్యత అమోఘం. ఆమె కోసం ఆయన పాడుతున్నారు. ఆమెకి కూడా ఆయనను నిరాశపరచడం ఇష్టం లేదు. అందుకే నిద్ర వస్తున్నా కవర్‌ చేస్తూనే తాళం వేస్తున్నారు’’ అంటూ తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘అమ్మకు గజల్‌ నచ్చలేదేమో. అందుకే ఆవలింతలు వస్తున్నాయి. క్యూట్‌ వీడియో షేర్‌ చేసినందుకు థాంక్యూ’’అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదవండి: ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు!
   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు