గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త.. రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆపై!

16 Aug, 2021 18:47 IST|Sakshi

ముంబై: భర్త మరో మహిళతో కలిసి ఉండగాగా వారి బాగోతాన్ని భార్య రెండ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది. భర్తతోపాటు పట్టుబడిన మహిళను చెడామడా ఉతికేసింది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అంతకముందే పెళ్లి అయ్యింది. అయితే ఇటీవల అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో కలిసి హోటళ్లు, రెస్టారెంట్లంటూ తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.  భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య అతనిపై కొన్ని రోజుల నుంచి ఫోకస్‌ పెట్టింది.  అతను ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లగా భార్య కూడా తననే ఫాలో అవుతూ వెళ్లింది.

ఈ క్రమంలో భర్త, తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో  ఔరంగాబాద్‌లోని ప్రముఖ హోటల్‌ వద్దకు వెళ్లారు. ఇద్దరు కలిసి కారు దిగి హోటల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వెంటనే వెనకనుంచి భార్య కారు వైపుకు  వేగంగా పరుగెత్తుకొచ్చింది. కారు డోర్ తీసిన వెంటనే ఎదురుగా తన భార్య ప్రత్యక్షం కావడంతో భర్త షాక్ అయ్యాడు. కారులో ప్రియురాలు కూర్చొని ఉండటంతో ఏం చెయ్యాలో తెలీక సతమతమయ్యాడు. అంతలోనే కారులోని మహిళను చూసిన భార్య కోపం నషాళానికి అంటింది. అగ్గిలం మీద గుగ్గిలం అయ్యి.. మహిళను బయటకు ఊడ్చేసింది. మహిళ ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకొని ఉండటంతో దానిని తొలగించడానికి ప్రయత్నిస్తూ జుట్టుపట్టుకొని చితకబాదింది. ఆమె ఎవరంటూ భర్తను ప్రశ్నించింది

అయితే భర్త తన భార్య నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా అతన్ని కూడా వాయించేసింది. దీంతో స్థానికంగా గందరగోళంగా మారడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జనాలు గుమిగూడారు. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అనేకమంది భార్యకు మద్దతు పలికారు. అయితే మహిళను కొట్టడం కంటే ఈ విషయంపై ముందుగా భర్తను ప్రశ్నించాలని సలహా ఇస్తున్నారు. ‘అందరికి బయటే బిర్యానీనే తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పప్పును తినరు. ఎందుకు’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

మరిన్ని వార్తలు