Matrimonial Ad: ఆ వివరాలు తెలపాలంటూ మాట్రీమోనియల్‌ యాడ్‌.. నెటిజన్ల ఆగ్రహం

22 Nov, 2021 19:17 IST|Sakshi

మాట్రీమోనియల్‌ సైట్లు, యాప్‌ల సాయంతో పలువురు యువతి, యువకులు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. యువతియువకులు తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలతో పాటు కుటుంబ వివరాలతో కూడిన ఫ్రొఫైల్‌ యాడ్‌ను మాట్రీమోనియల్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. అయితే చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు.. తమకు కాబోయేవారు ఎలా ఉండాలి? ఎలాంటి అభిరుచులు కలిగి ఉండాలి? అనే దానిపై చాలా స్పష్టత కనబరుస్తారు. 

మంచి క్వాలిటీస్‌ ఉన్న వారు తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటూరు. అయితే ముఖ్యంగా రంగు, ఎత్తు, అందం విషయంలో వెనక్కు తగ్గరు కూడా. అయితే ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా.. తనకు భార్యగా కాబోయే అమ్మాయి ఎత్తు, బరువు, పాదాలు, నడుము సైజ్‌ను తనకు నచ్చిన మెజర్‌మెంట్లతో ఉండాలని ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. అక్కడితో ఆగకుండా బ్రా సైజ్‌ను కూడా పేర్కొన్నాడు. ఇంకా కొన్ని విచిత్రంగా అనిపించే.. క్వాలిటీస్‌ను కూడా అందులో జతచేశాడు. అటువంటి అమ్మాయి వధువుగా రావాలని తెలిపాడు.

అయితే ముందుగా ఈ పోస్ట్‌ రెడ్డిట్ అనే సైట్‌లో అప్‌లోడ్‌ కాగా.. దాన్ని చూసిన నెటిజన్లు పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేయటంతో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తూ మండిపడుతున్నారు. ‘ఇలాంటివి ఎలా అడుగుతున్నావ్‌రా బాబు. నాకు విచిత్రంగా ఉంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఓ ట్విటర్‌ యూజర్‌ సంబంధిత మాట్రామోనియల్‌ యాప్‌కు ట్యాగ్‌ చేయగా.. అతనిపై తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

మరిన్ని వార్తలు