అమ్మ వైరల్‌ ఫోటోకి సెహ్వాగ్‌ స్పందన

25 May, 2021 20:12 IST|Sakshi

ఆ కుటుంబం మొత్తానికి ఆహారం అందిస్తా

న్యూఢిల్లీ :  అమ్మ అంటే అమ్మే ..ఆమెకు సాటి మరెవరు రారు.. అమ్మ పడుతున్న కష్టం చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నారు. అంతేకాదు  ఆ అమ్మకు తక్షణమే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. 

ఆక్సిజన్‌ సపోర్ట్‌
ఆక్సిజన్‌ సపోర్ట్‌తో  తన కుటుంబానికి వంట చేస్తున్న ఓ మాతృమూర్తి ఫోటో ఒకటి, గత  రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారింది. తల్లి ప్రేమకు నిర్వచనం అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు కరోనా కష్టకాలంలోనూ అమ్మకు పని చెప్పారంటూ విమర్శించారు. అయితే వీరేంద్రుడు వీరికి భిన్నంగా స్పందించాడు. తన ఫౌండేషన్‌ తరఫున ఆ అమ్మకు అవసరమైతే ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ అందిస్తానని... తనకు సంప్రదించాలంటూ వాట్సప్‌ నెంబర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. 

వంట చేసి పెడతాం
కేవలం ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్‌ అందివ్వడంతోనే తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు వెటరన్‌ క్రికెట్‌  వీరేంద్ర సెహ్వాగ్‌.  ఆ అమ్మకు పని భారం తగ్గించేందుకు .. ఆమెకు, ఆమె కుటుంబం మొత్తానికి తానే ఆహారం అందిస్తానంటూ ప్రకటించాడు. ఆ అమ్మ నుంచి స్పందన రావడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో తనే చొరవ తీసుకున్నాడు. ఎవరైనా ఆ.. అమ్మ అడ్రస్‌ , ఫోన్‌ నంబర్‌ తెలిస్తే వీరేంద్ర సెహ్వాగ్‌ ఫౌండేషన్‌ , అమృతాషుగుప్తాలకు తెలియజేయాలని కోరాడు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు