గిటేలి ఇమ్రాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ

15 Sep, 2020 11:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. గిటేలి ఇమ్రాన్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ గుజరాత్‌లో అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ క్రమంలో నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్టు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఎన్‌ఐఏ 11 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య 15కు చేరింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు సదరు వ్యక్తి దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. (చదవండి: విశాఖలో ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌)

పాకిస్తాన్‌కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు గాను సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు