‘జావేద్‌ అక్తర్‌ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’

6 Sep, 2021 21:26 IST|Sakshi

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్‌ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్‌ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్‌ అక్తర్‌పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్‌పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక)

జావేద్‌ అక్తర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది’ అని జావేద్‌ అక్తర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు