కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం

7 Jun, 2021 19:54 IST|Sakshi

కోల్‌కతా: కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం జరిగింది. ల్యాండ్‌ అవుతుండగా ఒక్కసారిగా విస్తారా విమానం కుదుపునకు లోనయ్యింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విమానంలో కుదుపుల కారణంగా ప్రయాణికులు కొందరు గాయపడ్డారు. 15 నిమిషాల్లో కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటుందనుకున్న సమయంలో విమానం ఒక్క సారిగా భారీగా కుదుపునకు లోనైంది. దీంతో విమానంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

ఈ క్రమంలోనే 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించినట్లు కోల్‌కతా విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారికి విమానంలోనే ప్రథమ చికిత్స అందించి కోల్‌కతా చేరుకున్న తరువాత ఆస్పత్రికి తరలించాము. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. కాగా విస్తారా యూకే 775 విమానం మహారాష్ట్రలోని ముంబై నుంచి పశ్చిమ బెంగాల్‌కు సోమవారం బయల్దేరింది. 

చదవండి: భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది సజీవ దహనం?

మరిన్ని వార్తలు