Thirdwave: పిల్లలపై ప్రభావం చూపదు: వీకే పాల్‌

8 Jun, 2021 11:04 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఆధారాల్లేవ్‌

ఏ సైంటిఫిక్‌ పరిశోధనలో పిల్లలపై థర్డ్‌వేవ్‌ ప్రభావం తేలలేదు

తల్లిదండ్రులు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలి

ఆందోళన చెందకండి

వెబ్‌డెస్క్‌: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదని కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌ తెలిపారు. ఏ వేవ్‌ కూడా ప్రత్యేకంగా పిల్లలపై ప్రభావం చూపుతుందనడానికి ఆధారల్లేవని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

ఆధారాల్లేవ్‌
‘కరోనా కేసులు చిన్న పిల్లల్లో పెరుగుతుండంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ పిల్లలపై కరోనా వేవ్‌ ప్రభావం చూపుతుందనడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన చెప్పారు.  ‘అడల్డ్‌లో సిరోప్రివలెన్స్‌ ఎలా ఉందో పిల్లల్లోనూ అలానే ఉంది.. అంటే పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే ఛాన్స్‌ ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన తెలిపారు. 

తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌
అదే విధంగా మళ్లీ కరోనా వేవ్‌ వస్తే.. అది పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందనడానికి  ఎటువంటి సైంటిఫిక్‌ ఆధారాలు లేవని ఇండియన్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌ తెలిపింది. వ్యాక్సిన్‌ విషయంలో తల్లిదండ్రులు సంకోచించవద్దన్నారు. పేరెంట్స్‌ టీకా వేసుకోవడం వల్ల పిల్లల్లో వైరస్‌ వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకోవచ్చన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు