పాపం శశికళ: ఓటర్‌ జాబితాలోనూ తొలగింపు?

6 Apr, 2021 14:19 IST|Sakshi

చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్‌ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్‌ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్‌ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. 

చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు