సంసద్ టీవీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

15 Sep, 2021 22:16 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలుపుతూ కొత్తగా సంసద్‌ టీవీ ఛానల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా పాల్గొన్నారు.  పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులో తేచ్చేందుకుగాను సంసద్ టీవీని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 
చదవండి: ఐఫోన్‌- 13 రిలీజ్‌..! విపరీతంగా ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..

సంసద్ టీవీలో  పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు; పథకాలు, విధానాల అమలు, పాలన; భారత దేశ చరిత్ర, సంస్కృతి; సమకాలిక స్వభావంగల సమస్యలపై ఈ చానల్‌ ప్రసారం చేయనున్నారు.  లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ ఛానళ్లను కలిపి ఒకే చానల్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. 2006 జూలైలో  లోక్‌సభ టీవీ ప్రారంభించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు లోక్‌సభ టీవీను  ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. 

చదవండి: రెండు కోట్ల ఉద్యోగాలపై ఆందోళనలకు యువజన కాంగ్రెస్‌ పిలుపు

మరిన్ని వార్తలు