నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి!

25 Feb, 2021 11:47 IST|Sakshi

న్యూఢిల్లీ :  రోజూ పొద్దెక్కే వరకు నిద్రపోతున్న మనల్ని ‘‘ బొట్టు సంపాదన లేదు.. దమ్మిడి ఆదాయం లేదు’’ అని ఇంట్లో పెద్దోలు తిట్టినపుడు.. నిద్రలేవటానికి బాధపడి.. కష్టంగా కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి పైకి లేచి.. ‘‘ అరే! నిద్రపోవటానికి కూడా ఎవరైనా డబ్బులిస్తే బాగుండు. హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించవచ్చు’’ అనుకుని ఉంటాం. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ‘‘ వేక్‌ ఫిట్‌ వారి బ్యాచ్‌ 2021-22 స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనటమే..

నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించాలనుకునేవారి కోసం ఇదో అత్యున్నతమైన ఉపాది అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే వారు 100 రోజుల పాటు ప్రతి రోజూ 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా, హాయిగా నిద్రపోవాలి. మొదట ఈ ఇంటర్న్‌షిప్‌కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యుత్తమంగా నిద్రపోయే కొంతమందిని ఎంపిక చేసి 100 రోజుల ఇంటర్న్‌షిప్‌కు అర్హుల్ని చేస్తారు. ఎంపికైన ప్రతీ ఒక్కరికి లక్ష రూపాయలు అందుతాయి. గెలిచినవారికి మాత్రమే 10 లక్షల రూపాయలు సొంతం అవుతాయి. మీరు ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern/ను సందర్శించండి. ఒకటికి రెండు సార్లు పూర్తి వివరాలు.. టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదివి కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోండి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు