కలిసికట్టుగా ఊడ్చేశారు..టీంవర్క్‌ అంటే ఇది 

16 Oct, 2020 16:41 IST|Sakshi

ఏ పనైనా ఒక్కరే చేస్తే తొందరగా అలసటకు గురవుతుంటాం.. కానీ అదే పనిని కలిసికట్టుగా చేస్తే ఎంత శ్రమిస్తున్నా అలసట మాత్రం అనిపించదు. ఒక టీమ్‌ వర్క్‌తో ముందుకు సాగితే పనులు ఎలా సాగుతాయన్నది చెప్పేందుకు ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. అసలు విషయంలోకి వస్తే..  భారీ వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు నిలవడం సర్వసాధారణం. రోడ్డుపై నిలిచిపోయిన నీరును డ్రైనేజీల్లోకి పంపించడానికి పారిశుద్య కార్మికులు చాలా కష్టపడతారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ నీరును డ్రైనేజీలోకి పంపిస్తారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. ఒకేసారి నలుగురు వ్యక్తులు కలిసి రోడ్డుపై నిలిచిపోయిన నీరును ఏకదాటిగా డ్రైనేజీలోకి పంపించారు. (చదవండి : ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే)

కాగా ఈ వీడియోనూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుషాంత్‌ నంద తన ట్విటర్లో షేర్‌ చేసుకున్నారు.  ' టీం వర్క్ అనే పదానికి వీళ్లే ఉదాహరణ. కలిసికట్టుగా పనిచేస్తే ఫలితం కూడా తొందరగా వస్తుంది. నలుగురు కలిస్తేనే టీం.. ఆ టీమ్‌కున్న బలం అందులో ఉన్న ఒక్కో వ్యక్తి.' అని కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్‌ షేర్‌ చేశారు. ' టీం ఉందంటే అందులో టీమ్‌ లీడర్‌ కృషి చాలా ఉంటుంది..  కలిసికట్టుగా ఉంటే ఏదైనా విజయవంతమే.. ఈ వీడియోలో చాలా గొప్ప మెసేజ్‌ ఉంది ' అంటూ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు