హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలిసారి కింగ్‌ కోబ్రా ప్రత్యక్షం.. వైరల్‌

8 Jun, 2021 14:18 IST|Sakshi

సిమ్లా: సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మన వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. అలాంటిది మన పక్కనే ఉంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ ఠాకూర్‌ తన ఇంటికి సమీపంలో ఉన్న పుట్టలో నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీశాడు. తన పెంపుడు కుక్కతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన సమయంలో ఇది జరిగింది. మొదట అది చిన్నపాము అని భావించినా.. వీడియో తీస్తున్నంతసేపు పాము పుట్టలోంచి పూర్తిగా బయటకు రావడానికి 40 సెకన్లు పట్టింది. దాదాపు ఆ పాము పొడవు 12 అడుగులకు పైగా ఉంది.

ఇంత పెద్ద పామును తాను ఎప్పుడు చూడలేదని.. ఇది ఏంటో తెలపాలంటూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌కు షేర్‌ చేశాడు. '' పర్వీన్‌ కష్వాన్‌ జీ.. నేను మార్నింగ్‌ వాకింగ్‌ వచ్చినప్పుడు పుట్టలోంచి పాము రావడం చూశాను. కానీ నా జీవితంలో అంత పెద్ద పామును మాత్రం చూడలేదు.. దయచేసి ఆ పాము ఏంటో చెప్పండి'' అంటూ కామెంట్‌ చేశాడు. అలా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చివరికి వైల్డ్‌లైఫ్‌ అధికారులో దృష్టిలో పడింది. వాళ్లు ఆ వీడియోనూ చూసి కింగ్‌ కోబ్రాగా తేల్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కింగ్‌ కోబ్రా కనిపించడం ఇదే తొలిసారని..  భారతదేశంలో కింగ్ కోబ్రా ప్రధానంగా పశ్చిమ కనుమల ప్రాంతంతో పాటు అస్సాం, బెంగాల్, ఒడిశా, టెరాయ్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత కింగ్‌ కోబ్రాలు ఆగ్నేయాసియాలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. 
చదవండి: వైరల్‌: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు