వైరల్‌: పిచ్చెక్కినట్లు కొట్టుకున్న పులులు

21 Jan, 2021 18:32 IST|Sakshi

ఢిల్లీ: ఇండియాలోని ఒక జాతీయ పార్కులో రెండు పులులు భీకరంగా ఫైట్‌ చేసిన ఘటన  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియోలో.. రెండు పులులు పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాయి. కొన్ని సెకన్ల వ్యవధిలో ఏం జరిగిందో తెలియదు కానీ పిచ్చెక్కిందా అన్న రేంజ్‌లో కొట్టుకున్నాయి. ఇంకా కొద్దిసేపు అలాగే ఫైట్‌ చేసి ఉంటే కచ్చితంగా ఏదో ఒక పులి ప్రాణం పోయి ఉండేది.

అయితే అదృష్టం బాగుండి రెండో పులి తలొంచినట్లుగా కిందపడి కాస్త తగ్గడంతో మొదటి పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండు పులుల మధ్య జరుగుతున్న భీకరపోరును పక్కనే ఉన్న ఒక టూరిస్టు బృందం స్వయంగా చూసి కాసేపు ఉత్కంఠకు లోనయ్యారు. అవి రెండు కొట్టుకుంటూ తమ మీదకు ఎక్కడ వస్తాయోనని వాళ్లు తెగ భయపడిపోయారు. కానీ అదృష్టం బాగుండి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ టూరిస్టు బృందానికి ప్రమాదం తప్పినట్లయింది.చదవండి: ఛీ ఛీ రుచిగా లేవు.. తిన్నాక నాకు లూజ్‌ మోషన్స్‌..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు