యువతి క్లాసికల్‌ డ్యాన్స్‌; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్‌

29 Jun, 2021 19:44 IST|Sakshi

సాధారణంగానే కుక్కలను విశ్వాసానికి మారుపేరు అని వింటుంటాం. ఎమోషన్స్‌ పరంగా చూసుకుంటే కుక్కులు మనుషులతో కలిసిపోయిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కల్లో ఈ విశ్వాసం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మనలో బాధ, సంతోషం, కోపం ఇలా ఏది కనిపించినా దానిని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మెలుగుతుంటాయి. తాజాగా ఒక యువతి తన పెంపుడు కుక్క ముందు క్లాసికల్‌ డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చింది. యువతి క్లాసికల్‌ స్టెప్పులు అదిరిపోవడంతో తన పెంపుడు కుక్క కూడా తన ముందు కాళ్లతో ఆమెను ఎంకరేజ్‌ చేస్తూ ఉత్సాహపరిచింది.

యువతి డ్యాన్స్‌ చేసినంత సేపు కుక్క అలాగే నిల్చొని ఉత్సాహపరచడం విశేషం. ఆమె తన డ్యాన్స్‌ పూర్తి చేసిన అనంతరం తన కుక్క దగ్గరకు వెళ్లి దానిని గట్టిగా హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనిని మొత్తం వీడియోగా తీసి ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. ఇంకేముంది క్షణాల్లో వీడియో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించగా.. లెక్కలేనన్ని లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి.
చదవండి: డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే

cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు