Heavy Rain In Patna: నీట మునిగిన డిప్యూటీ సీఎం నివాసం; వీడియో వైరల్‌

26 Jun, 2021 13:20 IST|Sakshi
రేణుదేవి, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి

పట్నా: బిహార్‌ రాజధాని పట్నాలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి నివాసం నీటమునిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ వర్షం దాటికి ఆమె నివాసం ఎదుట ఒకటిన్నర అడుగుమేర నీరు నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి కొద్ది గంటల్లోనే కురిసిన జడివానకు 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట ముగగా.. కాలువలు పొంగి పొర్లాయి.

ప్రస్తుత సీజన్‌లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ శాఖ శనివారం ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

చదవండి: 15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్‌

నర్సు నిర్వాకం, ఖాళీ సిరంజితోనే వ్యాక్సిన్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు