ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

5 Jun, 2022 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: భానుడి ప్రతాపానికి చిగురుటాకులా అల్లాడిపోతోంది ఢిల్లీ. రానున్న నాలుగైదు రోజులు వాతావరణం పొడిగా ఉండి, తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదీగాక శనివారం ఒక్కరోజే 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. దీంతో ఢిల్లీలో వేడుగాలులు అధికమవుతాయని, వడ దెబ్బ అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

అంతేకాదు ఢిల్లీలో కనీసం ఐదు వాతావరణ స్టేషన్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. దీనికి తోడు ప్రస్తుతం ఢిల్లీ  పీల్చే వాయువులో కూడా  నాణ్యత లేక ఉక్కిరబిక్కిరి అవుతోంది. పైగా ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది

అసలు అధిక ఉష్ణోగ్రతలు అంటే..
వాతావరణ శాఖ వివరణ ప్రకారం...గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా అంటే సాధారణం కంటే కనీసం 4.5 నాచ్‌లు ఎక్కువగా ఉంటే గరిష్ట ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. అంతేకాదు 6.5 నాచ్‌లు అధికంగా ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. వాస్తవంగా ఒక ప్రాంతం ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్ మార్క్‌ను దాటితే తీవ్రమైన ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు.

(చదవండి: భారత్‌లో కరోనా టెన్షన్‌.. కేంద్రం అలర్ట్‌)

మరిన్ని వార్తలు