కాంగ్రెస్‌ అన్యూహం: ప్రధానమంత్రి మోదీపై ప్రశంసలు

14 Apr, 2021 22:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించింది. వెల్డన్‌ మోదీ అంటూ కొనియాడింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సీబీఎస్‌ఈ  10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి తాము ఇచ్చిన సలహాను పాటించారని పేర్కొంది. దేశ హితం కోసం రాహుల్‌, ప్రియాంకగాంధీ ఎంతదూరమైనా వెళ్తారు. ప్రజల మెరుగైన భవిష్యత్‌ కోసం​ కలిసి పని చేయడం ప్రాథమిక విధి. అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే ప్రధాన పీట వేశారు’ అని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను బుధవారం రద్దు చేసింది. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అంతకుముందు ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ మొగ్గు చూపడంతో కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఇతర పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమైన మంత్రులు, విద్య శాఖ అధికారులు పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనపై ప్రియాంక గాంధీ కూడా ట్వీట్‌ చేసింది. 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది.
 

మరిన్ని వార్తలు