‘కూల్‌.. కూల్‌ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’: మోదీ

1 Apr, 2021 18:09 IST|Sakshi

కోల్‌కత్తా: ‘మేం పక్కా 200 సీట్లు గెలుస్తాం.. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా గెలుస్తాం.. మీలాగా సీజనల్‌ భక్తులం కాదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్‌తో తెలిసింది.. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లో గురువారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మమత బెనర్జీపై విమర్శలు చేస్తూనే తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

‘‘కూల్‌ కూల్‌.. 200 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మొదటి దశ పోలింగ్‌తో అధికంగా గెలుస్తామని తెలుస్తోంది. ప్రజల గళానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.’ అని పేర్కొన్నారు. నేను ఆలయాలకు వెళ్లడం గర్వంగా భావిస్తా.. మీలాగా పూటకోలాగ ఉండను’ అని బంగ్లాదేశ్‌ పర్యటనపై తృణమూల్‌ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ ఘాటుగా బదులిచ్చారు. నేను ఆలయాన్ని సందర్శించడం తప్పా? అని ప్రజలను పశ్నించారు. మమతాకు కాషాయ వస్త్రాలు, దుర్గ మాత నిమజ్జనాలు, జై శ్రీరామ్‌ నినాదాలు అన్నీ ఆక్రోశం తెప్పిస్తున్నాయని తెలిపారు. బెంగాల్‌లో బీజేపీ హవా.. కమలం హవా కొనసాగుతుందని.. రెండో దశ పోలింగ్‌కు వస్తున్న ఓటర్లను చూస్తుంటే తెలుస్తోందని మోదీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు