బెంగాల్‌ ఏడో దశ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

27 Apr, 2021 09:01 IST|Sakshi

కోల్‌కతా:  బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్‌ శాతం భారీగా నమోదైంది. 34 అసెంబ్లీ స్థానాలకు 75.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 259 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈనెల 29న 35 స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి.

 పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5:30 గంటల వరకు 75.06 శాతం పోలింగ్‌ నమోదైంది. నేడు ఐదు జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

► బెంగాల్‌లో ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 36.02 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. బెంగాల్‌లోని 5 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 

►  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. భోవానిపూర్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి శోభండేబ్ చటోపాధ్యాయ్‌ మన్మతానాథ్ నందన్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ ఈ నియోజకవర్గంలో గెలుపొందిన విషయం తెలిసిందే.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 284 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ దశలో పోలింగ్‌లో 86 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌ల ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

చదవండి: సెకండ్‌ వేవ్‌ దేశాన్ని కుదిపేస్తోంది

మరిన్ని వార్తలు